‘రామయ్య వస్తావయ్యా’ చిత్రం క్లయిమాక్స్‌కి వచ్చింది. ఈరోజు నుంచి చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాలను దర్శకుడు హరీష్ శంకర్ చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్స్ కూడా వేశారు. ఈసెట్లో ఎన్టీఆర్‌తోబాటు ప్రధాన తారాగణం పాల్గొనగా క్లయిమాక్స్ దృశ్యాల చిత్రీకరణ ప్రారంభించారు. ఈ చిత్రీకరణ పూర్తయితే, టాకీ మొత్తం పూర్తయినట్టే, ఇక కొన్ని పాటల చిత్రీకరణ మాత్రం మిగిలివుంటుంది. ఇదిలా వుంచితే, ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన పనులు కూడా మరోపక్క జరుగుతున్నాయి. సెప్టెంబర్ 27న విడుదలకు ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ సరసన సమంతా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది
No comments:
Post a Comment