Tuesday, 13 August 2013

మహేష్ 1′ రెండో టీజర్‌కు మిలియన్ వ్యూస్

మహేష్ హీరోగా నటిస్తున్న ’1′ చిత్రం రెండో టీజర్‌ మూడు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందని చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర తెలిపారు.
“మూడు రోజుల్లోనే ఒక మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసినందుకు హ్యాపీగా వుంది. సూపర్‌స్టార్ కృష్ణగారి బర్త్‌డేకి రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసినట్టే మహేష్ బర్త్‌డేకి రిలీజ్ చేసిన ఈ రెండో టీజర్‌కి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ దూకుడు ‘ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్‌స్టార్ మహేష్, సుకుమార్ కాంబినేషన్‌లో నిర్మిస్తున్న ’1′ లండన్ షెడ్యూల్ పూర్తి కావచ్చింది. జనవరి 10న సంక్రాంతి కానుకగా వరల్ట్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం” అని నిర్మాతలు చెప్పారు.
‘ 1 ‘ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఫైట్స్: పీటర్ హెయిన్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుకుమార్.

No comments:

Post a Comment