ఎన్టీఆర్ – చరణ్ వీరిద్దరితో సినిమాలు తీసి ఎంత లాభపడతాడో తెలీదు గానీ దిల్ రాజుకి మాత్రం ఇద్దరిలో ఎవరి మాట వినాలో తెలీక మైండ్ బ్లాంక్ అయిపోతోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నానన్న సంబరం ఆయన కళ్లలో కొంత కూడా లేదు. కారణం… అడకత్తెరలో పోకచక్కలా ఇద్దరి మధ్య నలిగిపోవడమే. ఎవరి మాటకు తలూపాలో తెలీయని ఆయోమయ పరిస్థితిలో ఉన్నాడు. చివరికి ఎన్టీఆర్ మాటవైపే తలొగ్గాడు. ఎవడు, రామయ్యా వస్తావయ్యా విడుదల తేదీలో కాస్త కన్‌ఫ్యూజన్ నెలకొంది. రెండు సినిమాల మధ్య కనీసం పది రోజులైనా వ్యవధి ఉండాలి. ముందు ఎవడు విడుదల చేసి, ఆ తరవాత రామయ్య సంగతి చూద్దామనుకొన్నాడు దిల్ రాజు. అయితే ఎన్టీఆర్ మాత్రం నా సినిమా చెప్పిన టైమ్‌కి రావాలి.. అని ఆర్డరేశాడు. దాంతో ఎన్టీఆర్ మాటకే విలువ ఇచ్చి, ఎవడు సినిమాని వెనక్కి నెట్టాడు దిల్‌రాజు. మరి రామ్‌చరణ్ ఎలా స్పందిస్తాడో, ఇంకెన్ని లిటికేషన్లు పెడతాడో..? స్టార్ హీరోలతో సినిమాలంటే ఇలాగే ఉంటుంది మరి.
No comments:
Post a Comment