moviesframe రేటింగ్ : విడుదల తేదీన
లైవ్ అప్డేట్స్ : మే 31 ఉదయం 9గం. నుండి ప్రారంభం
ప్రివ్యూ : ఇద్దరమ్మాయిలతో
అల్లు అర్జున్ కి మాస్ హీరో ఇమేజ్ రావడానికి దోహదం చేసిన సినిమాల్లో ‘దేశముదురు’ ఒకటి. అందులో బన్నీ షర్టు విప్పి చేసిన విన్యాసాలు టాలీవుడ్ హీరోలకు ఆదర్శమైంది. పూరి జగన్నాథ్ బన్నీలోని మాస్ కోణాన్ని పూర్తి స్థాయిలో చూపించాడు. వీరిద్దరూ ఇప్పుడు మరోసారి జట్టు కట్టారు. ప్రేమ, యాక్షన్, క్రైమ్, వినోదం ఇవన్నీ కలగలిపిన సినిమా ఇది. బన్నీ తొలిసారి ‘ఇద్దరమ్మాయిలతో’ డ్యూయెట్లు పాడిన సినిమా కూడా ఇదే. ఎన్నో అంచనాలు, కొన్ని నెగిటీవ్ టాక్‌లు, ఇంకెన్ని ఆకర్షణల మధ్య ఈ
సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలోని హైలెట్స్ ఏమిటి? ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఎలాంటివి?
సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలోని హైలెట్స్ ఏమిటి? ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఎలాంటివి?
* బన్నీ-పూరి కలయిక అంటే… కమర్షియల్ గా అంతకంటే కావల్సింది ఏం లేదు. దానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యాజిక్ తోడైంది. అందుకే ఈ సినిమా కొబ్బరి కాయ కొట్టుకొన్న దగ్గర నుంచి… టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
* ఎక్కువగా ఫారెన్ లో చిత్రీకరించారు. 90 % షూటింగ్ అక్కడే జరిగింది. అందమైన ఆ లొకేషన్లు… ఈ సినిమాలో కనుల పండువ చేస్తాయట. ఫటాఫట్ మంటూ సినిమాలు తీసేసే పూరి.. ఈ సినిమా కోసం ఇంకొన్ని ఎక్కువ రోజులు కష్టపడ్డారు. 100 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
* అమలాపాల్, కేథరిన్ ఇద్దరికీ బన్నీతో నటించడం ఇదే తొలిసారి. అమలాపాల్ కి రామ్‌చరణ్ నాయక్ లో నటించిన తరవాత.. ‘ఇద్దరమ్మాయిలతో’ ఛాన్స్ వచ్చింది. కేథరిన్ కి ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో నటించిన తరవాత.. చరణ్ తో ఛాన్స్ వచ్చింది. అలా మెగా హీరోలిద్దరూ ఈ హీరోయిన్ల ను మార్చుకొన్నారు.
* దేవిశ్రీ ఎప్పట్లాగే టాప్ లేచిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఐటెమ్ పాట అదిరిపోయిందట. బ్రహ్మానందం కూడా ఓ పాటలో అలరిస్తారు. ఈ ఆల్బమ్ హెక్సా ప్లాటినమ్ డిస్క్ కూడా అందుకొంది.
* ఈ సినిమాలో బన్నీ గిటారిస్ట్ గా కనిపిస్తారు. అతనికీ ‘ఇద్దరు అమ్మాయిలతో’ ఉన్న సంబంధం ఏమిటనేది తెరపైనే చూడాలి.
* ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకీ బృందావన కాలనీ, ఒంటరి, నా ఊపిరి సినిమాలతో సంబంధం ఉందని.. ఫిల్మ్‌నగర్ జనాలు అభిప్రాయ పడుతున్నారు. ఇదో విషాదాంతమైన స్టోరీ అట. ఒక నాయిక సినిమా మొదలవ్వక ముందే.. చనిపోతుందట. ఆమెను చంపిన వారిపై కథానాయకుడు ఎలా పగ తీర్చుకొన్నాడో తెరపైనే చూడాలి.
* ఇంట్రవెల్ బ్యాంగ్ అదిరిపోతుందని బన్నీ చెబుతున్నాడు. పతాక సన్నివేశాలూ షాక్ కి గురిచేస్తాయట.
* గబ్బర్ సింగ్, బాద్ షా సినిమాలతో బ్లాక్ బస్లర్ నిర్మాత అయిపోయాడు బండ్ల గణేష్. ఈసినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
* బన్నీ సినిమాలకు ఎప్పుడూ రానంత నెగిటీవ్ టాక్ ఈ సినిమాకు వచ్చింది. పూరి కి ఈమధ్య సరైన విజయాల్లేకపోవడం, దానికి తోడు ఈ సినిమా పలుమార్లు వాయిదా పడడం – ఈ నెగిటీవ్ టాక్ కి కారణం. పతాక సన్నివేశాలు మార్చేశారు.. అని కూడా చెప్పుకొంటున్నారు.
* మనందరి అనుమానాలు పటాపంచలు చేసేయడానికి ‘ఇద్దరమ్మాయిలతో’ ఈ శుక్రవారం ఉదయం వచ్చేస్తోంది. ఈ వేసవి చప్పగా సాగి నిరూత్సాహపరిస్తే… బన్నీ సినిమా ఆ లోటు పూడుస్తుందేమో చూడాలి.
‘ఇద్దరమ్మాయిలతో’ అప్ డేట్స్, రివ్యూ కోసం moviesframe చూస్తూనే ఉండండి.
No comments:
Post a Comment