Saturday, 1 March 2014

మగధీర-2


వాస్తవికతకు ఊహను జోడించి తెరకెక్కించే సినిమాల్ని సోషియోఫాంటసీలు అనొచ్చు. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఈ కోవలోని సినిమానే. మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 80లలో బాక్సాఫీస్‌ హిట్‌. వసూళ్ల సునామీ సృష్టించిన చిత్రమిది. సరిగ్గా రెండున్నర దశాబ్ధాల తర్వాత... అదే పాయింటుకు కాస్త అటూ ఇటూగా కల్పిత ప్రేమకథతో తెరకెక్కించిన సోషియో ఫాంటసీ సినిమా 'మగధీర'. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు మోతెక్కించింది. ఈ సినిమాకి సీక్వెల్‌ తీస్తే? అన్నదే ప్రస్తుత టాపిక్‌. 
 
ఫాంటసీ.. సినిమా అనుకున్నంత సులువు కానేకాదు. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడే తీయాలి. మళ్లీ చెర్రితో  సినిమా తీయటం కష్టమే. మగధీర వివాదానికి అల్లు అరవింద్ ప్రధాన కారణం. ప్రస్తుతం జక్కన్న బాహుబలితో బిజీ. ఈ సినిమా తర్వాత మళ్లీ అతడికి విశ్రాంతి అవసరం. అప్పట్లో 'మర్యాద రామన్న' తీసినట్టే ఇంకో సినిమా రిలీఫ్‌ కోసం చేయాలి. ఈలోగానే వార్త ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. చరణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో 'మగధీర-2' తెరకెక్కనుందన్నదే దాని సారాంశం. కానీ ఇది నిజమయ్యేందుకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయా? అంటే చెప్పలేం. పంచ్‌ డైలాగ్‌లు, స్క్రీన్‌ప్లే జిమ్మిక్‌, వంద శాతం వినోదాన్ని నమ్ముకుని సినిమాలు తీసిన త్రివిక్రమ్‌ ఇలాంటి కొత్త జోనర్‌ను టచ్‌ చేయాలంటే చాలా కసరత్తే చేయాలి. 
 
త్రివిక్రమ్ విషయం ఉన్న దర్శకుడే అయినా... ఈ కన్వర్షన్‌కి టైమ్‌ పడుతుంది. ఇప్పుడున్న ఫ్లోలో ఇది సాధ్యం కాదు. వారియర్‌ కాన్సెప్టుతో ఇలాంటి జోనర్‌లో సినిమా తీయాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అందుకే ఠెంకాయ కార్యక్రమం పూర్తి చేసుకునేవరకూ ఏదీ ముచ్చటించలేం. దర్శకధీరులు ఏం చేస్తారో మరి?

No comments:

Post a Comment